Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు...! 2 d ago
సిడ్నీ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్ నాలుగు బౌండరీలు బాదేశాడు. ఈ ఓవర్లో 16 పరుగులు రాబట్టడం గమనార్హం. దీంతో టెస్టుల్లో మొదటి ఓవర్లోనే అత్యధిక పరుగులు కొట్టిన భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ ఘనత సాధించాడు. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన యశస్వి (22)ని స్కాట్ బోలాండ్ బౌల్డ్ చేశాడు.